శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్.|

0
73

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆదివారం వార్డు 5 కాకా గూడ కమ్యూనిటీ హాల్లో మారేడ్ పల్లి లయన్స్ క్లబ్,మెడీకవర్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు మరియు జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజి, కార్డియాలజీ విభాగాలలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ముకుల్ మాట్లాడుతూ కంటి పరీక్షలలో కళ్ళజోళ్ళు అవసరమైన వారికి త్వరలోనే ఉచితంగా అందజేస్తామని, కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లను కూడా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా చేపిస్తామని ముకుల్ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని, భవిష్యత్తులో కూడా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని, ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ముకుల్ కోరారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 51
Telangana
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|
     సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి...
By Sidhu Maroju 2025-12-17 16:22:00 0 11
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com