కరాటే ఛాంపియన్ షిప్ బంగారు పతక విజేతకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
Posted 2025-11-05 07:10:05
0
282
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గం లోని బాలంరాయికి చెందిన మంచోళ్ళ సాయికుమార్ థాయిలాండ్ లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ యూత్ గేమ్స్ ఛాంపియన్ షిప్ - 2025 లో భారతదేశం నుంచి కియో జపాన్ షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియా తరపున పాల్గొన్నారు .ఆ పోటీలలో సాయి కుమార్ బంగారు పతకం సాధించి ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కోచ్ షేక్ ఖలీం తో పాటు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.సాయి కుమార్ ను, వారి కోచ్ షేక్ ఖలీం ను ఎమ్మెల్యే శ్రీగణేష్ మనస్పూర్తిగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించి, తన వంతు మాత్రమే కాకుండా ప్రభుత్వం తరపున కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందేలా చూస్తానని చెప్పారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమరవీరుల శిబిరంలో ఉద్యమకారుల దీక్షలు.|
• జేఏసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
• మూడో రోజు...
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక...
బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం 10వ తరగతి చదువుతున్న 60 మంది...
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు...