వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

0
324
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చట్టం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరి 26, 2026 నుండి మార్చి 24, 2026 వరకు జిల్లావ్యాప్తంగా జన్ సంవాద్ పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిని పటిష్టం చేస్తూ, పారదర్శకతతో కూడిన అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఆళ్ల విజయలక్ష్మి జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 266
Andhra Pradesh
బాబోయ్ బాహుబలి కొండచిలువ.. ఇదేంది ఇంత ఉంది…
కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 14 అడుగుల...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:58:55 0 754
Telangana
మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ...
By Sidhu Maroju 2026-03-18 13:48:48 0 242
Telangana
C M revanth redsy meets America delavr city governor
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ గారు...
By G k Nookala 2026-03-07 08:21:06 0 297
Telangana
చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.
    *చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్...
By Thalakokkula Sadanandam 2026-03-20 09:06:04 0 579
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com