జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|

0
65

సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు, విద్యార్థులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందిన విద్యార్థినిలు,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. కాలనీ లోపలికి రావాలంటే భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యాలకు సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించేంతవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు!!!!!!!!!!!!
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పుహోలీ కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-16 14:18:40 0 25
Andhra Pradesh
గూడూరు లో జిందా మదార్ షా వలి ఉర్సు షరీఫ్ ఉత్సవాలు కోటవీధి ఆసర్ ఖానా లో పోస్టర్ల విడుదల చేసిన మదార్ ఇంటి వంశకులు
గూడూరు పట్టణంలోని మదార్ షా వలి దర్గా లో ప్రతి సంవత్సరం నిర్వ హించే ఉర్సూఉత్సవాల పోస్టర్లను...
By mahaboob basha 2025-10-23 14:24:55 0 126
Bharat Aawaz
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా? మనమంతా జైలు అనగానే తప్పు...
By Bharat Aawaz 2025-08-20 10:25:57 0 603
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com