నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!

0
312

నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో  ముందడుగు! 

దోర్నాల మండలం, కర్నూల్- గుంటూరు ప్రధాన రహదారి (KG రోడ్డు) నుండి నల్లగుంట్ల గ్రామానికి 3.4 కిలోమీటర్ల మేర రూ.2 కోట్ల నిధులతో తారు రోడ్డు నిర్మాణ పనులకు యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ -

టీడీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్యా సదుపాయాల విస్తరణపై దృష్టి సారించిందని తెలిపారు. నల్లగుంట్ల గ్రామానికి అవసరమైన అంతర్గత రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాల కోసం కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో దోర్నాల మండలం టీడీపీ అధ్యక్షులు షేక్ మాబు గారు, సొసైటీ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి గారు, లీగల్ సెల్ అధ్యక్షులు వల్లభనేని కాశయ్య గారు, మండల కూటమి నాయకులు, నల్లగుంట్ల గ్రామ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బాబూ జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళి.!
"పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి" మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ...
By Sidhu Maroju 2026-07-06 09:50:35 0 131
SURAKSHA
John Neihlaia, IPS: Serving Mizoram with Integrity
The Journey Begins "The badge of an IPS officer symbolizes not only authority but also...
By Fathima Safa 2026-07-21 12:38:20 0 127
Andhra Pradesh
నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి
ప్రచురణార్ధం.18.01.26   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ...
By Rajini Kumari 2026-01-18 13:22:19 0 210
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 325
Telangana
తండాలో ఉద్రిక్తత : ఇద్దరు పోలీసులకు గాయాలు
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో...
By Bheeshman King 2025-12-24 11:55:22 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com