సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
Posted 2025-10-21 18:01:54
0
321
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన నియోజకవర్గం లోని బొల్లారం, బోయిన్ పల్లి ప్రాంతాల పరిధిలో పలు చోట్ల నిర్వహించిన సదర్ సమ్మేళన ఉత్సవాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. యాదవ సమాజం ఐకమత్యానికి సూచిక, వారి సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీక అయిన సదర్ పండుగను పురస్కరించుకుని పశువులకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.రాష్ట్ర అభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి యాదవ సమాజానికి తగిన గౌరవం ఇచ్చిందని తెలిపారు.ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, జయప్రకాష్, ప్రభాకర్ యాదవ్, పెద్దాల నరసింహ, మారుతి గౌడ్, సదానంద్,శరత్, అరుణ్ యాదవ్, తదితరులు ఉన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు...
Lakshadweep Strengthens Climate and Disaster Preparedness
Lakshadweep is reinforcing its disaster preparedness and climate resilience through measures...
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...
చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక...
గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్
మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్...