సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|

0
322

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం, బోయిన్ పల్లి ప్రాంతాల పరిధిలో పలు చోట్ల నిర్వహించిన సదర్ సమ్మేళన ఉత్సవాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్  మాట్లాడుతూ.. యాదవ సమాజం ఐకమత్యానికి సూచిక, వారి సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీక అయిన సదర్ పండుగను పురస్కరించుకుని పశువులకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.రాష్ట్ర అభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి యాదవ సమాజానికి తగిన గౌరవం ఇచ్చిందని తెలిపారు.ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే  శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, జయప్రకాష్, ప్రభాకర్ యాదవ్, పెద్దాల నరసింహ, మారుతి గౌడ్, సదానంద్,శరత్, అరుణ్ యాదవ్, తదితరులు ఉన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ సమావేశం
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది...
By Benguluri Madhubabu 2026-03-22 07:14:31 0 289
SURAKSHA
ఉన్న రోగుల కోసం తెలంగాణ పోలీసుల రక్తదాన శిబిరాలు
తెలంగాణ పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో అనేక సేవా...
By Kalaga Sailaja 2026-07-01 07:48:43 0 177
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:44:50 0 2K
Telangana
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
   చిలుకూరు ఏప్రిల్ 20  ఐదు సంవత్సరముల లోపు బాలలు కల్మషం లేని వారని దేవుళ్ళ తొ...
By Nookapangu Manikanta 2026-04-20 13:33:02 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com