Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.

0
216

అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్

33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి

ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న విద్యాసాగర్ 

 

ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో నిన్న నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విద్యాసాగర్‌ను దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

 

ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణతో పాటు నేతలు ఎం. రఘునాథరెడ్డి, జి. హృదయరాజు, బి. సాంబశివరావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి....
By Pagadala Venkateswar 2026-03-31 03:25:14 0 196
Andhra Pradesh
Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-22 10:36:06 0 238
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 255
Andhra Pradesh
చింతూరు మండలం లక్కవరంలో వ్యక్తి దారుణ హత్య.
చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్ అనే...
By Shyamala Yadagiri 2026-05-14 11:46:50 0 201
SURAKSHA
M.R. Ajith Kumar IPS: Championing Modern Kerala Policing
The Journey Begins "Leadership in policing is measured not by authority alone, but by the...
By Fathima Safa 2026-07-08 11:15:27 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com