అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి

0
73

సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డిసిపి బాల స్వామి తెలిపారు. నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకొని నెలవారిగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాను కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్ లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులకు విచారణలో  తేలడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 103
Health & Fitness
No Link to Sudden Deaths and COVID Vaccination
There is no direct link between sudden deaths in adults and Covid-19 vaccines, the Ministry of...
By Bharat Aawaz 2025-07-03 08:31:56 0 2K
Karnataka
Karnataka May Require YouTubers to Obtain Licenses |
The Karnataka government is considering a licensing requirement for YouTubers launching channels...
By Pooja Patil 2025-09-16 07:24:28 0 59
Andhra Pradesh
APలో రైతులకు మద్దతుగా టమాటా ధర తగ్గింపు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో టమాటా ధరలు...
By Bhuvaneswari Shanaga 2025-10-07 04:51:50 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com