సమిష్టి కృషితో బిఆర్ఎస్ (మన) అభ్యర్థిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
94

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల లో భాగంగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్  గెలుపు కోసం శ్రీనగర్ కాలనీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బూత్ ఇంచార్జీలతో కీలక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో శ్రీనగర్ కాలనీ 8 బూత్ ల ఇంచార్జీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొని, బూత్ నంబర్లు 303 నుండి 310 వరకు ఉన్న బూత్ ఇంచార్జీలతో ప్రత్యేకంగా సమావేశమై, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలను వివరించారు. పార్టీ శ్రేణులు ప్రతి ఓటరును కలిసి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గం కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, శ్రీనగర్ కాలనీ బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు.

అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారి గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని నేతలు, కార్యకర్తలు సంకల్పం తీసుకున్నారు.       

ఈ కార్యక్రమంలో...కార్పొరేటర్లు: చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్,మాజీ కార్పొరేటర్: మురుగేష్ నాయకులు: బద్దం పరుశురాం రెడ్డి, జె.ఎ.సి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, అమీనుద్దీన్, డోలి రమేష్, చిన్న యాదవ్, మధుసూదన్ రెడ్డి, శివ గౌడ్, సురేష్, హేమంత్ పటేల్,సంపత్ యాదవ్, ఉస్మాన్, వంశీ ముదిరాజ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బైర్ అనిల్, నర్సింగ్ రావు, జనార్ధన్. శ్రీనగర్ కాలనీ నాయకులు: అప్పు ఖాన్, సూర్య కుమారి సత్యనారాయణ, చంద్రశేఖర్, ప్రసన్న రెడ్డి, ఇమ్రాన్, చిన్న రావు, ఫయాజ్, రవి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Sidhu Maroju 2025-11-16 13:38:19 0 43
Telangana
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ నీటి వివాదం: శ్రీశైలం ప్రాజెక్టుపై భట్టి విక్రమార్క హెచ్చరిక
నీటి వివాదం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య శ్రీశైలం రిజర్వాయర్ నీటి వాటాపై ఉద్రిక్తతలు...
By Triveni Yarragadda 2025-08-11 14:15:02 0 811
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com