త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
83

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు. హెల్త్ డిపార్ట్మెంట్ మరియు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న R&B డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పనులు ఎలా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులతో పేదవాడు అత్యవసర సమయాలలో వైద్యం కోసం హాస్పటల్ కు వచ్చినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వారికి ఎక్కడెక్కడ ఏ సేవలు అందుబాటులో ఉంటాయో హాస్పటల్లోకి వచ్చిన వెంటనే తెలిసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.త్వరితగతిన నిర్మాణం పూర్తి కావడానికి ఏరకమైన సహాయ సహకారాలు అవసరమైనా అందిస్తానని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గార్ల దృష్టికి కూడా తీసుకువెళ్లి నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ కూడా ఇందులో విలీనం అయినందున ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నారని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇన్ని వసతులతో ఇంత మంచి హాస్పటల్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని, 1000 పడకలు అందుబాటులోకి రానున్నాయని, న్యూరాలజీ, ట్రామాకేర్, క్యాన్సర్, ఆర్థోపెడిక్ మొదలగు 19 విభాగాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని,మెడికల్ కాలేజీ కూడా 23 విభాగాలతో టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు కాబోతుందని,మెరుగైన వసతులతో అతి తొందరలోనే నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, వైస్ చైర్మన్ లు కదిర్వన్,యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్,వేణుగోపాల్ రెడ్డి,రామ్, బాలరాజు, హయత్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి....
By Sidhu Maroju 2025-09-16 09:13:17 0 123
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com