అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.

0
317

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన రెడ్డి జన సంఘం సమ్మేళనంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచ్చ బొల్లారంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, భవిష్యత్‌ లో మరింత అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెడ్డి భవనం పేద ప్రజలకు ఎల్లవేళల ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు కుల సంఘ ఐక్యతను ప్రతిబింబించే ఈ సమ్మేళనం, భవిష్యత్‌లో సామాజిక శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంఘ సభ్యులు గుమ్మడి ఆనంద్ రెడ్డి, కౌకుంట్ల శ్రీధర్ రెడ్డి,తోట దేస్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep Strengthens Marine Conservation Efforts
Lakshadweep continues to prioritize marine conservation and sustainable development to protect...
By Fathima Safa 2026-06-29 07:53:10 0 146
Andhra Pradesh
చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపన
చీరాల: చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు...
By Gadiyapudi Narendra 2026-01-20 12:10:07 0 396
Telangana
మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి...
By Avunoori Mahesh 2026-04-11 16:53:03 0 251
Telangana
‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది...
By Ponnala Srinivasrao 2026-03-13 04:36:30 0 332
SURAKSHA
K. A. P. Sinha, IAS: Steering Punjab with Vision & Integrity
A Distinguished IAS Officer Driving Administrative Excellence, Governance Reforms, and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-17 10:42:32 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com