PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.

0
255

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ బృందం పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించి, మూడు పీడీఎస్ రైస్ వాహనాలను స్వాధీనం చేసుకుంది.

1) ఈ రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు గ్రామపంచాయతీ – భారత్ పెట్రోల్ బంక్ వద్ద నెంబర్ లేని టాటా విన్ట్రా వాహనంలో పీడీఎస్ రైస్ బ్యాగులు నింపి పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం అందింది.ఆ సమాచారం మేరకు పెట్రోల్ బంక్ లో నిలిపి ఉన్న AP39 TZ 5164 (TATA VINTRA) అనే వాహనాన్ని (వాహనం వద్ద ఎవరూ లేరు) తనిఖీ నిర్వహించి, అందులోని మొత్తం 2.5 టన్నులు (50 కేజీలవి, 50 బస్తాలు) బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది.

2)నిన్న రాత్రి 10:30 గంటలకు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట 5/18 లైన్ వద్ద పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతోందని టాస్క్ ఫోర్స్ బృందానికి సమాచారం అందింది.

ఆ సమాచారాన్ని SB CI గారికి తెలియపరచి, టాస్క్ ఫోర్స్ CI గారి ఆదేశాల మేరకు రైడ్ నిర్వహించి AP39 WA 9402 (VINTRA Vehicle) అనే వాహనాన్ని, వాహన డ్రైవర్ పాలేటి.నాగరాజును అదుపులోకి తీసుకుని, వాహనంలో ఉన్న మొత్తం 3.5 టన్నులు(50 కేజీలవి, 70 బస్తాలు) స్వాధీనం చేసుకోవడం జరిగింది

 పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని గుంటూరు జిల్లా పోలీస్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోక
సిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను...
By Mahankali Ravi 2026-06-03 07:13:32 0 263
Dadra &Nager Haveli, Daman &Diu
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi In a special message to...
By BMA ADMIN 2025-05-23 06:52:36 0 3K
Andhra Pradesh
మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్
మరొకరిని బలిగొన్న టిప్పర్  బైక్ ఢీ ఒకరు స్పాట్ మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్...
By Chennaiah Kati 2026-06-24 08:20:25 0 94
Telangana
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-04 08:37:48 0 110
Telangana
మంచిర్యాలలో క్రీడా ప్రాంగణాల కోసం డిమాండ్
మంచిర్యాల: నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు....
By Avunoori Mahesh 2026-09-20 01:54:53 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com