స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి

0
92

సికింద్రాబాద్ :   గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి సహాయత స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎనలేనిది గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ వాణి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంతో పాటు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఆపరేషన్ థియేటర్ లకు మరమ్మత్తులు చేసి ఆధునికరించి ప్రారంభోత్సవం చేశారు.అర్పన్, రోగి సహాయత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ వాణి ఆయా విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ సూపర్డెంట్ వాణి మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల వైద్య చికిత్సల కోసం అధునాతన పద్ధతిలో రూపుదిద్దుకున్న ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలకు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. గాంధీ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించేందుకు వైద్యులు, ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం తోడవడం మూలంగా మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు. సిఎస్ఆర్ నిధుల కింద 39 లక్షలతో అత్యవసర విభాగాలైన ఆర్థోపెడిక్ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లను మరమ్మతులు చేపట్టడం జరిగిందని అన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Sports
International Scuba Day: Celebrating the Wonders Beneath the Waves
August 6 marks International Scuba Day, a global celebration dedicated to the adventurous sport...
By Bharat Aawaz 2025-08-06 07:09:57 0 792
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 187
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com