"బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ" శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక

0
80

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ >    తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను అల్వాల్‌లో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  ఈ వేడుకలకు అల్వాల్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రంగురంగుల చీరలతో మెరిసిన మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి తాళాల కట్టులో పాటలు పాడుతూ ఆడిపాడారు. బతుకమ్మ పూల పరిమళం, సద్దుల సమర్పణతో వాతావరణం మరింత భక్తిమయంగా మారింది. చిన్నారులు కూడా పెద్దల వెంట పాటలు పాడుతూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ— “బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. మహిళలు ఒక్కటిగా చేరి జరుపుకునే ఈ పండుగ మన సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది” అన్నారు. ఆధునిక జీవనశైలిలోనూ బతుకమ్మ పండుగ ఆచారాలను కొనసాగించాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయానికి అడ్డంకులు |
రాజమండ్రిలో “శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం” స్థాపనకు సంబంధించి...
By Bhuvaneswari Shanaga 2025-10-07 04:43:09 0 29
Andhra Pradesh
కేఎల్‌ విద్యార్థుల శాటిలైట్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి |
గుంటూరు జిల్లా:తాడేపల్లిలోని కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీకి నేడు కేంద్ర మంత్రి...
By Bhuvaneswari Shanaga 2025-10-18 08:36:08 0 42
Rajasthan
राजस्थान सरकार ने IAS, IPS और IFS अधिकारियों की केंद्र प्रतिनियुक्ति पर रोक लगाई
राजस्थान सरकार ने #IAS, #IPS और #IFS अधिकारियों की #केंद्र_प्रतिनियुक्ति पर रोक लगा दी है। इस...
By Pooja Patil 2025-09-13 08:19:13 0 135
Andhra Pradesh
నగర హృదయంలో రైవస్‌ కాలువ చరిత్ర చీకటి |
విజయవాడ నగరం మధ్యలో ప్రవహించే రైవస్‌ కాలువకు మామూలు కాలువలా కనిపించినా, దాని వెనక ఆసక్తికర...
By Bhuvaneswari Shanaga 2025-10-15 04:01:40 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com