దోమల వల్ల కలిగే వ్యాధులు నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే విజయవాడ నగరపాలక సంస్థ

0
430

*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

 

*19-12-2025*

 

*దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే*

 

దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహణ తో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం బ్రహ్మరాంబపురం ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు.

 

అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే, డ్రై డే నిర్వహించాలని, వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటి లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు ,పాత టైర్లు ఖాళీ డబ్బాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని అవగాహన కల్పించారు. 

 

ఈ కార్యక్రమంలో బయోలజీస్ట్ కామేశ్వరరావు, స్టేట్ కన్సల్టెంట్ కొండ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, ఏ ఎన్ యం లు, ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.

 

*పౌర సంబంధాల అధికారి*

 

*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

Search
Categories
Read More
SURAKSHA
After Retirement: WB Police Fight Social Evils
tired WB police officers are fighting social evils in society. Village rallies organized against...
By Kalaga Sailaja 2026-07-03 13:22:39 0 127
Andhra Pradesh
చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-19 18:42:45 0 174
Andhra Pradesh
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
By Pagadala Venkateswar 2026-05-04 06:13:24 0 146
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్...
By Pagadala Venkateswar 2026-05-22 05:00:22 0 106
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com