చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
85

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్ లో రజకసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బానిస బతుకులకు,వెట్టిచాకిరికి, భూస్వాములు, జమిందారుల దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడిన తీరును కొనియాడారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ కలిగిన మహిళ అని, భూస్వాములు జమీందారుల ఇళ్లల్లో బలహీన వర్గాల మహిళలు వెట్టి చాకిరి చేసేవారని ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ గారు పోరాడారని చెప్పారు. రైతులు తాము పండించిన పంటను జమీందారులు, భూస్వాములు, దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చేదని, దానితో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యేవారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాటపటిమ నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాకలి ఐలమ్మ  ప్రాధాన్యతను గుర్తుంచుకుని, భావి తరాలకు వారి ఖ్యాతిని తెలియజేయడం కోసం కోఠి లోని మహిళా యూనివర్సిటీకి వారి పేరు పెట్టి "చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ" గా నామకరణం చేశారని, ఇది చాకలి ఐలమ్మ  పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సి.ఇ.ఓ మధుకర్ నాయక్ గారు,కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, రజకసంఘం నాయకులు సోమన్న,కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
SLP కొట్టివేత.. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు |
తెలంగాణ ప్రభుత్వం BC రిజర్వేషన్ల పెంపుపై తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చుక్కెదురుగా...
By Bhuvaneswari Shanaga 2025-10-16 12:22:51 0 30
Telangana
హైదరాబాద్‌ స్టాకింగ్‌ నేరాల్లో ముందంజ |
2023 NCRB (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం...
By Bhuvaneswari Shanaga 2025-10-01 04:38:07 0 29
BMA
Why Every Media Professional Should Join Bharat Media Association (BMA)
Why Every Media Professional Should Join Bharat Media Association (BMA) In Today’s...
By BMA (Bharat Media Association) 2025-05-16 06:47:14 0 3K
Andhra Pradesh
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...
By mahaboob basha 2025-07-25 01:51:01 0 868
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com