రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే!! కర్నూలు జిల్లా ఎస్పీ

0
211

కర్నూలు: పత్రికా ప్రకటన  (23.12.2025)

50 సార్లు రక్తదానం చేసిన కర్నూలు టు టౌన్  కానిస్టేబుల్ చిన్న సుంకన్న

అభినందించి శాలువతో సన్మానించిన... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు. 

రక్తదానం... ప్రాణ దానంతో సమానం... సేవా భావంతో పని చేయడం అభినందనీయం...జిల్లా ఎస్పీ

రక్తదానం చేయడం అంటే  ప్రాణదానం చేయడం లాంటిదని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు. 

కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  చిన్న సుంకన్న  50  సార్లు  రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం అభినందించారు. 

శాలువ , పూల మాలతో సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు. 

పోలీసు శాఖలో  విధులు నిర్వహిస్తూ , సేవాభావంతో  రక్తదానం చేయడం  అభినందనీయమని జిల్లా ఎస్పీ  గారు  కొనియాడారు.

2011 బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుల్. స్వస్ధలం కర్నూలు , బుధవారపేట . 

ఈయన కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుండి ఎవరైనా అత్యవసర సమయములలో పోలీసులకు ,ప్రజలకు, గర్భవతులకు వివిధ సమస్యలతో హాస్పిటల్స్ చేరిన వారికి  వెంటనే స్పందించి రక్తదానం చేయడమే కాక అనేక మందిని రక్తదాతలుగా ప్రోత్సహించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, కర్నూలు డిఎస్పీ  బాబు ప్రసాద్ , కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో
ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం...
By Boya Dasthagiri 2026-06-22 13:55:54 0 141
Telangana
కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....
భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం...
By Gujile Ramu 2026-06-23 08:18:14 0 123
Tamilnadu
Supreme Court Reviews Tamil Nadu Medical Seat Transfer
The Supreme Court has agreed to examine a petition challenging the Tamil Nadu government's...
By Navya Sree 2026-06-25 13:11:09 0 78
Telangana
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సనకరాయాంటీ వేడుకల్లో...
By Pinnehasan Odela 2026-01-15 14:19:08 0 235
Telangana
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం ...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం  ‎కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:20:11 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com