వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు

0
85

మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్ జేవియర్ స్కూల్ సమీపంలోని రైల్వే లైన్ ఆర్‌యు‌బి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆర్‌సీసీ పైపులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తొలగించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో సమస్యను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే , అక్కడి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఆర్‌సీసీ పైపులను తొలగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం ని కలిసి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. ఫలితంగా ఈరోజు ఆర్‌యు‌బి కింద అడ్డుగా ఉన్న పైపులు తొలగించబడడంతో నీటి ప్రవాహం సులభంగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అల్వాల్ అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, బిఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌడ్ ఫ్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
Chandigarh
SAD to Contest All 35 Wards in Chandigarh Polls |
The Shiromani Akali Dal (SAD) has announced its plan to contest all 35 wards in the upcoming...
By Bhuvaneswari Shanaga 2025-09-20 10:26:35 0 154
Jharkhand
CoBRA, Jharkhand Police Eliminate Top Maoist Leaders in Hazaribagh |
The CRPF’s CoBRA unit and Jharkhand Police eliminated three top Maoist leaders in...
By Pooja Patil 2025-09-16 07:39:39 0 191
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 51
Telangana
హైదరాబాద్ పీహెచ్‌డీ హోల్డర్ 2.46 కోట్ల మోసంలో అరెస్ట్ |
హైదరాబాద్‌లో పీహెచ్‌డీ పట్టభద్రుడైన ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ నిపుణుడు,...
By Bhuvaneswari Shanaga 2025-09-25 07:14:47 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com