అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు : దర్శించుకున్న ఎమ్మెల్యే

0
124

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సూర్యనగర్ కాలనీ ఫేజ్ 2లోని దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి పూజలు అర్పించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నవరాత్రులు మహిళ శక్తి ప్రాధాన్యతను గుర్తుచేసే పవిత్ర సందర్భమని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో భక్తి, సాంఘిక సేవలకు దోహదపడతాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డోలి రమేష్, సురేందర్ రెడ్డి,  స్థానిక కాలనీవాసులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com