అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!

0
263

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లా...నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...
By Hari Krishna 2026-01-04 10:38:59 0 216
Telangana
మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్...
By Avunoori Mahesh 2026-07-11 08:54:36 0 132
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 155
SURAKSHA
Hari Chandana Dasari IAS: Driving Innovation in Governance
A visionary Telangana IAS officer transforming governance through sustainability, innovation,...
By Lokeshwari Panthadi 2026-07-10 11:01:13 0 104
Andhra Pradesh
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం  ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల...
By Chennaiah Kati 2025-12-23 04:48:41 0 470
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com