నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం

0
88

సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ₹3.94లక్షల విలువైన 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుజున్నారు.    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో కొనర్క్ ఎక్స్ ప్రెస్ రైల్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బొబ్బరాల లక్ష్మీ గంజాయితో పట్టుబడిందని జీఆర్పీ డీఎస్పీ ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. విచారించగా బొన్య అనే వ్యక్తితో కలసి ఆంధ్రప్రదేశ్ పాడేరు అటవీ ప్రాంతం నుండి మహారాష్ట్ర సోలాపూర్ కు గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. గంజాయిని తరలిస్తే ఒక ట్రిప్ కు 3వేలు తనకు ఇస్తానని బొన్య చెప్పినట్లు ఆ మహిళ తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే తమను చూసి పారిపోయినట్లు చెప్పారు. అతడు ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రెండు పర్యాయాలు జైల్ కు వెళ్లినట్లు వివరించారు. మహిళ వద్ద దొరికిన 3.94లక్షల వికువైన 8కిలోల గంజాయిని స్వాదీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

#Sidhumaroju 

Search
Categories
Read More
Sports
డకౌట్ అయినా బ్యాటింగ్ ఎంజాయ్ చేశా: కోహ్లీ |
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
By Akhil Midde 2025-10-25 11:40:33 0 44
West Bengal
'We are with centre, but they cannot decide our representative': Mamata Banerjee on Op-Sindoor outreach
West Bengal Chief Minister Mamata Banerjee has reaffirmed her party’s support for the...
By BMA ADMIN 2025-05-19 18:06:33 1 2K
Telangana
24K, 22K, 18K బంగారం తాజా రేట్లు |
హైదరాబాద్‌లో బంగారం ధరల్లో కొద్ది కొద్ది తగ్గుదల నమోదైంది. 24 కెరేట్ (999) బంగారం ధర...
By Bhuvaneswari Shanaga 2025-09-25 05:27:08 0 55
Tamilnadu
Actor, Krishna, Detained By Chennai Police In Cocaine Case
So far, 22 individuals - including a few police personnel - have been arrested in connection with...
By Bharat Aawaz 2025-06-25 16:33:55 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com