నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం

0
117

సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ₹3.94లక్షల విలువైన 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుజున్నారు.    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో కొనర్క్ ఎక్స్ ప్రెస్ రైల్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బొబ్బరాల లక్ష్మీ గంజాయితో పట్టుబడిందని జీఆర్పీ డీఎస్పీ ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. విచారించగా బొన్య అనే వ్యక్తితో కలసి ఆంధ్రప్రదేశ్ పాడేరు అటవీ ప్రాంతం నుండి మహారాష్ట్ర సోలాపూర్ కు గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. గంజాయిని తరలిస్తే ఒక ట్రిప్ కు 3వేలు తనకు ఇస్తానని బొన్య చెప్పినట్లు ఆ మహిళ తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే తమను చూసి పారిపోయినట్లు చెప్పారు. అతడు ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రెండు పర్యాయాలు జైల్ కు వెళ్లినట్లు వివరించారు. మహిళ వద్ద దొరికిన 3.94లక్షల వికువైన 8కిలోల గంజాయిని స్వాదీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

#Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 13
Bihar
मोकाम–मुंगेर रोड कॉरिडोर को मिली मंजूरी
केंद्र सरकार ने मोकाम–मुंगेर के बीच एक 4-लेन हाइवे (#GreenfieldHighway) बनाने की मंजूरी दे...
By Pooja Patil 2025-09-11 06:33:47 0 85
Andhra Pradesh
21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం !!
కర్నూలు : కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు...
By krishna Reddy 2025-12-15 03:24:44 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com