అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ "1070"

0
196

 

 

 హైదరాబాద్:   హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌రు 1070 అందుబాటులోకి వ‌చ్చింది. 1070 నంబ‌రుకు ఫోను చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్  ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే టోల్‌ఫ్రీ ద్వారా స‌మాచారాన్ని అందించ‌వ‌చ్చున‌ని తెలిపారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. చెట్లు ప‌డిపోయినా, వ‌ర‌ద ముంచెత్తినా, అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగినా ఇలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితులున్న‌ప్పుడు హైడ్రాకు సంబంధించిన సేవ‌ల‌న్నిటికోసం టోల్ ఫ్రీ నంబ‌రు 1070 ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. 

అందుబాటులో సెల్ నంబ‌ర్లు కూడా...

ఓఆర్ఆర్ ప‌రిధిలో ప్ర‌భుత్వ, ప్ర‌జా ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు 8712406899 నంబ‌రుకు స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. దీనికి తోడు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు, భారీ వ‌ర్షాలు ప‌డి కాల‌నీలు, ర‌హ‌దారులు నీట మునిగినా, అగ్ని ప్ర‌మాదం జ‌రిగినా వెంట‌నే 8712406901, 9000113667 ఈ రెండు నంబ‌ర్ల‌కు ఫోను చేయాల‌ని హైడ్రా కోరింది. 1070 టోల్ ఫ్రీ నంబ‌రుతో పాటు.. పైన పేర్కొన్న మూడు సెల్ నంబ‌ర్ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని.బి.అనుష్క 24/10/2025 నుండి 26/10/2025 వరకు...
By mahaboob basha 2025-10-27 23:26:28 0 24
Punjab
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields Results
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields...
By BMA ADMIN 2025-05-20 08:20:15 0 1K
Telangana
బోనాల చెక్కుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని...
By Sidhu Maroju 2025-07-09 17:25:37 0 984
Telangana
ప్రజల సమస్యలపై ఘాటుగా స్పందించిన పాల్ |
హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన...
By Bhuvaneswari Shanaga 2025-10-11 09:09:58 0 59
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com