అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ "1070"

0
197

 

 

 హైదరాబాద్:   హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌రు 1070 అందుబాటులోకి వ‌చ్చింది. 1070 నంబ‌రుకు ఫోను చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్  ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే టోల్‌ఫ్రీ ద్వారా స‌మాచారాన్ని అందించ‌వ‌చ్చున‌ని తెలిపారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. చెట్లు ప‌డిపోయినా, వ‌ర‌ద ముంచెత్తినా, అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగినా ఇలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితులున్న‌ప్పుడు హైడ్రాకు సంబంధించిన సేవ‌ల‌న్నిటికోసం టోల్ ఫ్రీ నంబ‌రు 1070 ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. 

అందుబాటులో సెల్ నంబ‌ర్లు కూడా...

ఓఆర్ఆర్ ప‌రిధిలో ప్ర‌భుత్వ, ప్ర‌జా ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు 8712406899 నంబ‌రుకు స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. దీనికి తోడు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు, భారీ వ‌ర్షాలు ప‌డి కాల‌నీలు, ర‌హ‌దారులు నీట మునిగినా, అగ్ని ప్ర‌మాదం జ‌రిగినా వెంట‌నే 8712406901, 9000113667 ఈ రెండు నంబ‌ర్ల‌కు ఫోను చేయాల‌ని హైడ్రా కోరింది. 1070 టోల్ ఫ్రీ నంబ‌రుతో పాటు.. పైన పేర్కొన్న మూడు సెల్ నంబ‌ర్ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Chhattisgarh
स्वास्थ्य विभाग में भर्ती प्रक्रिया में नए सुधार
स्वास्थ्य विभाग ने #RecruitmentProcess को और पारदर्शी और त्वरित बनाने के लिए नई पहल की है। इससे...
By Pooja Patil 2025-09-11 07:31:27 0 58
Andhra Pradesh
దర్యాప్తు షురూ: రాయవరంలో ఏడుగురిని బలిగొన్న అగ్ని ప్రమాదం |
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం వి. సవరం గ్రామంలోని బాణాసంచా తయారీ...
By Meghana Kallam 2025-10-10 01:38:58 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com