గణనాథులను దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు.

0
255

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో  కాలనీల మరియు అసోసియేషన్ సభ్యులు  ఏర్పాటు చేసిన గణనాథులని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా అయన మండపాలలో గణనాథులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని వేడుకున్నారు. అనంతరం బౌరంపేట్ లోని హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్లు అర్కల జీతయ్య, సర్గారి భీమ్, దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ షామీర్పేట్ రంగయ్య, సీనియర్ నాయకులు ధర్మా రెడ్డి, వార్డు ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి, నాయకులు బైండ్ల గోపాల్, సునీల్, మహేందర్ నాయక్, మహేష్ నాయక్, రోషన్ నాయక్, మరియు స్థానిక నాయకులు, యువకులు. అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    Sidhumaroju 

Search
Categories
Read More
Goa
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...
By BMA ADMIN 2025-05-21 09:40:47 0 2K
Telangana
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
By Bharat Aawaz 2025-08-12 12:57:28 0 667
Telangana
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు!!!!!!!!!!!!
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పుహోలీ కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-16 14:18:40 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com