ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

0
372

 

 

 

 

 మెదక్ జిల్లా:  మెదక్  నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖాముఖి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని అప్పటికప్పుడే సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ నియోజకవర్గంలో చేయడం జరిగిందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   -sidhumaroju 

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత...
By Sidhu Maroju 2025-12-06 12:20:57 0 97
Karnataka
Karnataka Expands ‘Ganitha Ganaka’ Tutoring Scheme Statewide
Following its success in the 2024–25 pilot phase, Karnataka is expanding the Ganitha Ganaka...
By Bharat Aawaz 2025-07-17 06:45:40 0 1K
Punjab
Punjab Embarks on Historic Irrigation Project with Malwa Canal Construction
Chandigarh: In a historic initiative, the Punjab government under Chief Minister Bhagwant...
By BMA ADMIN 2025-05-20 08:30:22 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com