గూడూరు లో ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ

0
496

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి*జెండావిష్కరణలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఆదివారం గూడూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ఏపీయూడబ్ల్యూజే నాయకులు జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సమావేశంలో పేర్కొన్నారు. జర్నలిస్టులందరకు అక్రిడేషన్లు, ఇంటి స్థలాలతోపాటు కొత్త ఇల్లును కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ బీమా, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించి జర్నలిస్టులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యతతో పోరాటాలు సాగించి హక్కులను సాధించుకోవాలని సమావేశంలో పలువురు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కు సన్మానం చేసి ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లను జర్నలిస్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే స్టేట్ మెంబర్ జీ ఉరుకుందు, గౌరవ సలహాదారులు శ్రీనివాస నాయుడు, తాలూకా సెక్రెటరీ సాక్షి శ్రీనివాసులు, కార్యదర్శులు కిరణ్ కుమార్, దౌలత్ ఖాన్, ప్రభాకరు, లక్ష్మన్న, శరత్, అబ్దుల్లా, అబ్దుల్ లతీఫ్, మహబూబ్ బాషా, షేక్షావలి, ఇస్మాయిల్, మిన్నెల, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని భక్తుల సౌకర్యాన్ని మరిన్ని పెంచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ 13-12-2025      *భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని...
By Rajini Kumari 2025-12-13 11:22:11 0 97
Telangana
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
 బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
By Sidhu Maroju 2025-06-30 18:06:47 0 989
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com