అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
433

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్ కాలనీలలో 39 లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ తో పాటు కలిసి పాల్గొన్నారు.పనుల ప్రారంభోత్సవం అనంతరం కాలనీల వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరుతున్న 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో కనీవినీ అభివృద్ధి జరుగబోతుందని,అందరం సమన్వయం చేసుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  -sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఇంటోనోవ్ కార్గో: శంషాబాద్‌ను చేరిన రాక్షసుడు |
రంగారెడ్డి:తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో...
By Bhuvaneswari Shanaga 2025-10-11 09:32:27 0 27
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 61
Telangana
దసరా తర్వాత బంగారం ధర తగ్గి ఊరట |
హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 3, 2025 న బంగారం ధర స్వల్పంగా  తగ్గింది. 24 క్యారెట్ బంగారం ధర...
By Bhuvaneswari Shanaga 2025-10-03 13:04:12 0 35
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com