శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.

0
486

హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం సికింద్రాబాద్ లోని సంగీత్ థియేటర్ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికీ మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు.

    -sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com