రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు

0
613

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

 

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు  ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, అక్కాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ఈ సాంప్రదాయాన్ని ఎంతో సౌభ్రాతృత్వ భావంతో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...అమ్మాయిలు, మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలు. మహిళల రక్షణ, సంక్షేమం నా మొదటి కర్తవ్యం. ఈ రాఖీ నాకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నారు. అదే విధంగా రాఖీ పౌర్ణమి ప్రేమానుబంధాలకు, సహోదరత్వానికి ప్రతీక అని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ, ఆడబిడ్డలు తమ అన్నలకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి,తో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
వరంగల్–మహబూబాబాద్ రూట్‌లో 300 ఎకరాల పీవోహెచ్ |
తెలంగాణ రాష్ట్రంలోని మానుకోట వద్ద రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్–మహబూబాబాద్...
By Bhuvaneswari Shanaga 2025-10-08 10:27:34 0 25
Telangana
గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా...
By Sidhu Maroju 2025-06-14 08:09:03 0 1K
Telangana
హైదరాబాద్‌ స్టాకింగ్‌ నేరాల్లో ముందంజ |
2023 NCRB (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం...
By Bhuvaneswari Shanaga 2025-10-01 04:38:07 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com