రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు

0
577

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

 

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు  ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, అక్కాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ఈ సాంప్రదాయాన్ని ఎంతో సౌభ్రాతృత్వ భావంతో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...అమ్మాయిలు, మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలు. మహిళల రక్షణ, సంక్షేమం నా మొదటి కర్తవ్యం. ఈ రాఖీ నాకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నారు. అదే విధంగా రాఖీ పౌర్ణమి ప్రేమానుబంధాలకు, సహోదరత్వానికి ప్రతీక అని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ, ఆడబిడ్డలు తమ అన్నలకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి,తో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో...
By Sidhu Maroju 2025-07-14 11:03:26 0 908
BMA
📰 James Augustus Hicky: The Rebel with a Printing Press
📰 James Augustus Hicky: The Rebel with a Printing Press!! The First Voice of Indian Journalism...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-29 11:30:32 0 2K
Andhra Pradesh
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర...
By Kanva Prasad 2025-05-28 16:39:08 0 2K
Telangana
ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న...
By Sidhu Maroju 2025-06-27 09:34:05 0 1K
Telangana
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహ ఆవిష్కరణ
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున...
By Vadla Egonda 2025-07-05 01:51:13 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com