బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు

0
611

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం.

బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం – వర్షంలో వాహనదారుల తంటాలు”  రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో గంటపాటల పాటు నిరీక్షణ.  బొల్లారం రైల్వే గేట్ వద్ద రిపేర్ పనులు జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వర్షం కారణంగా సమస్య మరింత జటిలమై, రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో దాదాపు 50 నిమిషాల పాటు భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా .. వర్షంలో వందలాది మంది బైక్ రైడర్లు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, పాదాచారులు  నిలిచిపోయారు.రైల్వే గేట్ వద్ద నిలిచిన వాహనాల క్యూలు కిలోమీటర్ ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు వర్షంలో తడుస్తూ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజలు, స్థానికులు, వాహనదారులు మాట్లాడుతూ...   ప్రతి సారి రిపేర్ పేరుతో ఇలాగే గంటల తరబడి నిలిపేస్తారు. వర్షం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నాం.ఇలాంటి పనులను ముందుగానే ప్రకటించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పరిస్థితులు మళ్లీ రాకుండా రైల్వే గేట్ వద్ద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

    --Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేటు బడి.. అంతులేని దోపిడీ... ఈ స్కూల్ కి ఒక. స్పెషాలిటీ ఉంది... ఎటువంటి అనుభవము లేని ఉపాధ్యాయులతో
కర్నూలు జిల్లా గూడూరు జోనియస్ గ్లోబుల్ స్కూల్..   ప్రైవేటు బడి.. అంతులేని దోపిడీ... ఈ...
By mahaboob basha 2025-08-12 00:17:41 0 516
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 785
Telangana
శ్రీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా పలు శాఖలతో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం
సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను...
By Sidhu Maroju 2025-06-24 08:10:53 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com