అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

0
645

హైదరాబాద్/ హైదరాబాద్.

 

ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా, సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క  సంతాపం వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి సీతక్క  మాట్లాడుతూ... శిబూ సోరెన్  ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడిగా.., ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆయన గిరిజన సంఘాల హక్కుల కోసం, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయ‌న సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

-సిద్దుమారోజు 

Like
1
Search
Categories
Read More
Telangana
ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను...
By Sidhu Maroju 2025-06-15 11:28:15 0 1K
Telangana
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
By Sidhu Maroju 2025-09-16 15:16:07 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com