ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం

0
216

గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు.

కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 12 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొన్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. సోమవారం జరిగే కార్యక్రమానికి గత వారం అందిన ఫిర్యాదులు పరిష్కార నివేదికతో అధికారులు హాజరుకవాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. ప్రతి విభాగంలో పిజిఆర్ఎస్, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. అర్జీల పరిష్కారంపై జిఎంసి పిఎంయు బృందం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. 

పిజిఆర్ఎస్ ద్వారా 31 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 7, ఇంజినీరింగ్ విభాగం 11, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగం 4, ఉపా సెల్ విభాగం 1, పరిపాలన విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తెలిన కంకర
కమలాపూర్ మండలం ఉప్పల్లో గతీడాది నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కంకర తినడంతో ప్రయాణికులు...
By Prashanth Goindla 2026-06-22 11:36:40 0 271
Andhra Pradesh
త్వరలో గరుడ పథకం ఏపీలో.
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా...
By Pagadala Venkateswar 2026-01-13 12:03:47 0 255
Andhra Pradesh
మదనపల్లి: ఆటో విషయంపై గొడవ.. తల్లి – బిడ్డపై దాడి.
శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం...
By Pagadala Venkateswar 2026-02-07 07:05:21 0 189
Andhra Pradesh
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ...
By Rajini Kumari 2026-05-07 08:16:30 0 152
SURAKSHA
Guardians of Peace: The Inspiring Journey of Shri Akshay Sachdeva, IPS
From Engineering Excellence to the Helm of Law and Order: How a Gold Medalist Structural Expert...
By Kalaga Sailaja 2026-07-31 06:23:56 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com