వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు

0
654

మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.

 

 జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ – దినకర్ నగర్, వెస్ట్ వెంకటాపురం, రోడ్ నెంబర్ 15లో కాలనీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రధాన సమస్యలు.

సాయంత్రం కాగానే మందుబాబులు రోడ్డుపైన కూర్చొని సిగరెట్, మద్యం తాగడం వల్ల కాలనీలో రాకపోకలు చేసే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది.రోడ్డుపై మూత్ర విసర్జన, చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోంది.ఆవులు, జంతువులు చెత్తలో తిరగడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం. వర్షాకాలంలో దోమలు, చీమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించి, చెత్తను తొలగించడంతో పాటు ప్రతి రోజు శుభ్రత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే, ఈ ప్రదేశంలో ప్రత్యేక డంపింగ్ బిన్ ఏర్పాటు చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
   సికింద్రాబాద్/ సికింద్రాబాద్.   చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను...
By Sidhu Maroju 2025-08-11 11:23:38 0 559
BMA
📰 Unsung Heroes of the Media: The Silent Voices That Keep Democracy Alive
📰 Unsung Heroes of the Media: The Silent Voices That Keep Democracy Alive 🎙Beyond the Headlines,...
By Your Story -Unsung Heroes of INDIA 2025-05-01 18:02:53 1 2K
Telangana
తెలంగాణ, భాతుకమ్మ వరల్డ్ రికార్డు ప్రయత్నం |
తెలంగాణ రాష్ట్రం భాతుకమ్మ పండుగలో మరో గొప్ప రికార్డును స్థాపించడానికి సిద్ధమవుతోంది. 28...
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:15:11 0 82
Telangana
ఇస్మాయిలీ సివిక్ ఆరోగ్య శిబిరం సేవలు |
హైదరాబాద్‌ కొంపల్లి ప్రాంతంలో ఇస్మాయిలీ CIVIC సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం...
By Bhuvaneswari Shanaga 2025-10-06 10:26:43 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com