కూటమి పాలనలో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
 
                    వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్
కర్నూలు మండలంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంపై దిశానిర్దేశం ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో స్కీంలు లేవని, అన్నీ స్కాంలేనని వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ విమర్శించారు. ఎన్నికల సమయంలో నమ్మించి మోసం చేయడం బాబు నైజమని, ఇచ్చిన మాటకు కట్టుబడి 100 శాతం హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నైజమని అన్నారు. కర్నూలు మండల వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ అర్హులందరికీ అన్నీ పథకాలు అందిస్తే...ఈవీఎంల ద్వారా సీఎం అయి చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెబుతున్నారంటే ఆయన ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రో ప్రజలు ఆలోచించాలన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లను చూస్తే ఆరోగ్య శ్రీ, డ్యాంలు, అమ్మఒడి, నాడు–నేడు, కార్పొరేట్ విద్య, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చిహ్నలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, నయవంచన, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన మోసగాడుగా గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో స్కీంలు ఒక్కటీ అమలు కావడం లేదుకానీ స్కాంలు మాత్రం భారీగా జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు తల్లికి వందనం అంటూ అర్హులైన తల్లులకు పథకాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు. దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్తే ఆ దీపం వెలగకుండానే ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, అంతకు రెండు రెట్లు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో చోటు చేసుకున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్‌ను పార్టీ కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 40 వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ నెంబర్, కోడుమూరు ఆర్టిఐ విభాగం అధ్యక్షులు విక్రమ్ సింహారెడ్డి, జడ్పిటిసి ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ నెహెమియా, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కర్నూలు జిల్లా డాక్టర్ సింగ్ అధ్యక్షులు హరికృష్ణ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు డి వాసు, రేమట సంపత్ కుమార్, కార్మిక శాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఆదాం, కోడుమూరు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు ఎంకే వెంకటేష్, బూత్ కమిటీ అధ్యక్షులు గుజ్జల లక్ష్మీకాంతరెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులు వినయ్ కుమార్ రెడ్డి, ప్రచార విభాగమ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఎంప్లాయిస్ పింఛన్స్ విభాగం అధ్యక్షులు రామకృష్ణ యాదవ్, మేధావి విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొజ్జన్న, సోషల్ మీడియా అధ్యక్షులు గిరిప్రసాద్, శ్రీధర్ రెడ్డి, దిగువపాడు సర్పంచ్ రవీంద్రారెడ్డి, జిల్లా అనుబంధాల విభాగాల నాయకులు మధు, తులసి రెడ్డి, మధు శేఖర్, మాజీ ఎల్లమ్మ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, వీరభద్రారెడ్డి, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, ఎంపీటీసీ శేఖర్, కర్నూలు మండలం కో కన్వీనర్ గొందిపర్ల గోపాల్, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, రవి రెడ్డి, కర్నూలు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేష్, యూత్ వింగ్ అధ్యక్షులు మధు, ఐ టి వి అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి సంపత్ కుమార్, వీరారెడ్డి, మాజీ కోఆప్షన్ నెంబర్ అస్మతుల్లా, హనూక్, మద్దిలేటి, అయ్య స్వామి, శేషన్న, మహేంద్ర, అనిల్ భాష, కేశవరెడ్డి, కృష్ణ, మల్లికార్జున, రామరాజు, సలీం భాష, బజారి, దామోదర్, మౌలాలి, రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
 
                                               
                                                             
                               ABOUT BMA
                ABOUT BMA
               Bharat Aawaz
                Bharat Aawaz
               
        