శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్

0
2K

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

ప్రధాన కార్యక్రమాలు:

ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.

ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రసాద్ శుక్లా.|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్...
By Sidhu Maroju 2026-03-05 19:03:02 0 153
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస     *అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి*...
By Rajini Kumari 2025-12-30 10:40:15 0 250
Andhra Pradesh
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా...
By Hari Krishna 2025-12-21 09:14:39 0 236
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com