ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

0
633

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

ఈ సందర్భంగా తరగతి గదుల్లో పరిశుభ్రతను పాటించాలని, పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ,వంట సరుకుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థులకు బోధన పద్ధతులను సమీక్షించి, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బోధన, పిల్లల సౌకర్యాలలో ఎలాంటి లోపాలు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని తెలిపారు.

ఈ పర్యటనలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మల్లాపూర్ తహసిల్దార్ రమేష్ మరియు  ఎంపీడీవో శశికుమార్ సంబంధిత అధికారులు కలెక్టర్ గారితో కలిసి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Delhi - NCR
నేడు బ్యాంకులకు సెలవు.. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో! |
అక్టోబర్ 25, 2025 న భారతదేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడ్డాయి. ఇది నెలలో నాలుగవ శనివారం...
By Deepika Doku 2025-10-25 08:16:45 0 18
Tripura
Tripura Power Corp Pushes Ahead with Smart Meter Rollout Amid Pushback
Tripura State Electricity Corporation (TSECL) is moving forward with plans to install smart...
By Bharat Aawaz 2025-07-17 07:48:31 0 907
Telangana
తెలంగాణ, కోస్తాలో వర్ష బీభత్సం.. వాయుగుండం ముప్పు |
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-21 06:59:41 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com