ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

0
821

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

ఈ సందర్భంగా తరగతి గదుల్లో పరిశుభ్రతను పాటించాలని, పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ,వంట సరుకుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థులకు బోధన పద్ధతులను సమీక్షించి, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బోధన, పిల్లల సౌకర్యాలలో ఎలాంటి లోపాలు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని తెలిపారు.

ఈ పర్యటనలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మల్లాపూర్ తహసిల్దార్ రమేష్ మరియు  ఎంపీడీవో శశికుమార్ సంబంధిత అధికారులు కలెక్టర్ గారితో కలిసి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిబి ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా
గూడూరు లో 2 వ సచివాలయం పరిధిలోనీ శ్రీరాముల వారి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన టిబి (క్షయ) వ్యాధి...
By mahaboob basha 2025-06-18 11:17:24 1 1K
Andhra Pradesh
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్
కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా...
By mahaboob basha 2025-07-07 14:16:45 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com