నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్

0
989

మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు. కొత్త వ్యక్తుల కదలికను పోలీసులకు సమాచారం ఇవ్వాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 280 చలాన్లకు 87,895 వేల రూపాయను చాలాన్ రూపంలో కట్టించడం జరిగింది.

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావ్ ఐపీఎస్. ఆదేశాల మేరకు తూప్రాన్ డీఎస్పీ శ్రీ.నరేందర్ గౌడ్, తూప్రాన్ సీఐ,రంగ క్రిష్ణ, మనోహరాబాద్ ఎస్సై, సుభాష్ గౌడ్ ,గార్ల ఆధ్వర్యంలో సీఐలు - 03, ఎస్సైలు -15 మంది మొత్తం 120 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్లకల్ గ్రామం కాలనీలలో ఆకస్మికంగా కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించి సుమారు 300 ఇళ్లను సోదాలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం 249 లిక్కర్ బాటిళ్లు 23 బీరు బాటిళ్లు పట్టుకుని కేసులు నమోదు చేయడం జరిగింది మరియు పత్రాలు మరియు నెంబర్ ప్లేట్ సరిగా లేని 1,కారు. 1ఆటో. 80.ద్విచక్రవాహనాలు.   మొత్తం 82 వాహనాలు అదుపులోకి తీసుకొని సీజ్ చేసి పోలీస్టేషన్ కు తీసుకువెళ్లారు. అలాగే..చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 280 చలాన్లకు 87,895 వేల రూపాయను చాలాన్ రూపంలో కట్టియడం జరిగింది. అలాగే సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీ.జే.నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా ల మరియు గుడుంబా తయారీ, గంజాయిని విక్రహిచడం, పీడీస్ రైస్ అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గుడుంబా,గుట్కా,గంజాయి లాంటి అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడ కూడదన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు. మరియు ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వెంటనే దానిని రెన్యూవల్ చేపించుకోవాలని సూచించారు. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం అన్నారు. మహిళలు, యువతులు, చిన్న పిల్లలతో మర్యాదగా ప్రవర్తించి వారిని గౌరవించాలి. మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట వారితో కూడా అలాగే మెదలాలని సూచించారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం... కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో, ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులుగా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చి అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. ప్రజల రక్షణ, ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అనే భరోసా నమ్మకం కలిగించే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. మీ కాలనీ లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ 112 కు గాని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.  సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలిసినటువంటి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను లింకును ఓపెన్ చేయొద్దని, అత్యాశకు పోయి లాటరీ వచ్చిందని, లోన్ వచ్చిందని వచ్చిన, ఏదైనా గిఫ్ట్ లు వచ్చాయని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్లను చెప్పకూడదు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 112 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ, జాన్ రెడ్డి, రామాయంపేట సిఐ, వెంకట రాజా గౌడ్,  తూప్రాన్ సబ్ డివిజన్ అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్స్, మహిళ కానిస్టేబుళ్లు. హోంగార్డ్స్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Mizoram
Mizoram की पहली रेलवे लाइन: ऐतिहासिक कनेक्टिविटी कदम”
Mizoram ने अपना पहला #RailwayLine Sairang से Aizawl तक चालू करके एक ऐतिहासिक उपलब्धि हासिल करी...
By Pooja Patil 2025-09-12 05:50:20 0 104
Telangana
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్
ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి...
By Vadla Egonda 2025-07-14 17:52:38 0 977
Punjab
Punjab Rolls Out ₹10 Lakh Health Cover for All 65 Lakh Families
Chief Minister Bhagwant Mann unveiled the Mukhyamantri Sehat Yojana on July 8, offering ₹10 lakh...
By Bharat Aawaz 2025-07-17 10:59:43 0 983
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com