Bharat Aawaz

ఏఐకెఎస్ జాతీయ మహాసభల జయప్రదం చేయాలని ఎడ్లబండ్లు,ట్రాక్టర్లతో ప్రదర్శన

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
5 min read
0
Comments
54
Views

ఏఐకెఎస్ జాతీయ మహాసభల జయప్రదం చేయాలని ఎడ్లబండ్లు,ట్రాక్టర్లతో ప్రదర్శన

 

నవంబర్ 15 న లక్షలాదిగా నల్గొండ తరలిరండి

 

రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ

 

ఈనెల 15 నుండి 18 వరకు నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహాసభలు జయప్రదం చేయాలని స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుండి సెంటర్ వరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాపిత రైతాంగ ఉద్యమాలకు నాలుగు రోజులపాటు నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. ఈనెల 15వ తేదీన లక్షమంది రైతులతో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పదివేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రిటిష్ వలస వాదానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పడిందని తెలిపారు.రైతు గిట్టుబాటు ధరకై అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఎ ఐ కె ఎస్ ఉందని తెలిపారు.జాతీయ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభకు రైతాంగంతో పాటు ఇతర ప్రజలు కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే కుట్రలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని,ప్రజలను కదిలించి భవిష్యత్లో పోరాటాలు నిర్వహించి భూమి నుండి రైతును వేరు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఎలినీనో ప్రభావం వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.దొడ్డి దారిన అమలు చేయాలని చూస్తున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిప్పికొట్టడానికి రైతాంగాన్ని పోరాటాలకు సిద్ధం చేసేందుకు జాతీయ మహాసభలలో ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.రైతాంగ ఉద్యమాల బలోపేతానికి,రైతు రక్షణ కొరకు జరుగుతున్న జాతీయ మహాసభల జయప్రదానికి రైతులకు మద్దతుగా రైతు క్షేమాన్ని కోరుకునే ఇతర ప్రజానికం కూడా నల్గొండకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ సిఐటియు జిల్లా నాయకులు లిక్కి బాలరాజు వీర్ల రమేష్ జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కున్సోత్ షణ్ముఖ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శ నల్లగొపు పుల్లయ్య మండల కార్యదర్శి బచ్చలకూర శ్రీనివాస్ నర్రా శివరామకృష్ణ గండమాల భాస్కర్ కొండె కృష్ణ చింతలపూడి సాయి కూమార్ చింతల శ్రీనివాసరావు భూక్యా శంకర్ బాలు వెంకటేశ్వర్లు ఉడుగుల శ్రీకాంత్ లిక్కి నాగరాజు వీర్ల మల్లేష్ కున్సోత్ కిషన్ జగన్ కొలహలం శ్రీధర్ రాజు కొమరె రెడ్డి పాండవుల సత్యనారాయణ భూక్యా హతిరాం నల్లగొర్ల రమేష్ సట్టు నర్సింహారావు సట్టు తిరుపాలు కాసు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.