దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

0
957

దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) 5 ఏళ్లుగా ప్రజాప్రయోజనాలకే కట్టుబడి, ఉత్తమ పాలనతో నిరంతరంగా సేవలందించడంతో, ISO 9001:2015 మరియు HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ను అందుకోవడం గర్వకారణమని ఎమ్మెల్యే  శ్రీ కె.పి.వివేకానంద్  పేర్కొన్నారు. 1960లో స్థాపితమైన ఈ బ్యాంక్, గత 5 సంవత్సరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. 2019లో రూ.24.85 కోట్ల డిపాజిట్లు ఉండగా, 2024 నాటికి ఇవి రూ.56.82 కోట్లకు పెరిగాయి. అప్పుల జారీ రూ.21.22 కోట్ల నుంచి రూ.32.26 కోట్లకు, ఆస్తుల విలువ రూ.2.9 కోట్ల నుంచి రూ.9.97 కోట్లకు, లాభాలు రూ.53 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ బ్యాంక్‌కు చెందిన రెండు భవనాలు మరియు ఐదు గోదాముల ద్వారా వార్షికంగా రూ.1.53 కోట్ల అద్దె ఆదాయం లభిస్తోంది. ఈ భవనాలు నాబార్డ్ నుండి రుణంగా పొందిన నిధులతో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం బ్యాంక్ నెలకు రూ.1.19 లక్షల EMI చెల్లిస్తోంది. ప్యాక్స్ నిర్వహణ వ్యవస్థ రైతులకు మరియు ఖాతాదారులకు ప్రయోజనకరంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని ఎమ్మెల్యే గారు ప్రశంసించారు. ఈ బ్యాంక్ అభివృద్ధి ఇతర ప్యాక్స్‌కు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా PACS అధ్యక్షుడు శ్రీ నరేంద్ర రాజు గారు, వైస్ చైర్మన్ శ్రీ రవీందర్ రెడ్డి గారు, డైరెక్టర్లు శ్రీ సిహెచ్ మధుసూదన్ గారు, పి. మల్లేష్ గారు, జి. కృష్ణ యాదవ్ గారు, డి. నరేందర్ గారు, బి. మధుసూదన్ గారు, ఎం. మదన్ రావు గారు, ఏ. సత్యనారాయణ గారు, సీఈవో శ్రీ కృష్ణ గారు, మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహ ఆవిష్కరణ
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున...
By Vadla Egonda 2025-07-05 01:51:13 0 1K
Prop News
From Visibility to Vision: Join the PROPIINN
PROPIINN Is a Real Estate Movement, Not Just a Marketplace Real estate is no longer just about...
By Bharat Aawaz 2025-06-26 05:47:04 0 2K
Telangana
సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొనడం |
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు....
By Bhuvaneswari Shanaga 2025-10-21 09:42:19 0 37
Telangana
చలో హైదరాబాద్‌కు ముందు అరెస్టులు |
రీజినల్ రింగ్ రోడ్ (RRR) కోసం జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా BRS నాయకులు, రైతులు "చలో...
By Bhuvaneswari Shanaga 2025-10-06 07:26:20 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com