Bharat Aawaz

కొత్తగూడెం వృద్ధుల హక్కుల పరిరక్షణకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
16
Views

కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో వృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం. ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెల్లడి.

 

కొత్తగూడెం: వృద్ధుల హక్కుల పరిరక్షణతో పాటు వారికి న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ రిబ్బన్ కట్ చేసి క్లినిక్‌ను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆస్తి సంబంధిత సమస్యలు, పిల్లల నుంచి నిర్లక్ష్యం, పోషణ, సంరక్షణకు సంబంధించిన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ కేంద్రం ద్వారా న్యాయ సలహాలు, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. వృద్ధులు గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితాన్ని గడిపేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ పావని, సాహితి, ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ ఏఓ లక్ష్మణ్, పారా లీగల్ వాలంటీర్లు భారతి, రాజకుమారి, జానకిరామ్, వీరభద్రం, లీగల్ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.