Bharat Aawaz

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డులో జిల్లా మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్‌కు ఘన సన్మానం

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
59
Views

ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో మైనారిటీ ప్రజల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా మైనారిటీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్ గారిని వార్డులోని మైనారిటీ నాయకులు, ప్రజలు కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మరియు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తనను సన్మానించినందుకు షేక్ కలీమ్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డు ప్రజలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు ప్రజలు సయ్యద్ రసూల్, నాయకులు ఆరిఫ్, కరిమాలి, సాజిద్, మజీద్ తదితరులు పాల్గొన్నారు.