Bharat Aawaz

₹72.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
155
Views

 

● రెండు కాలనీల్లో రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన

● నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

అల్వాల్,అక్టోబర్31:మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలో శనివారం అల్వాల్ సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులతో కలిసి ఆయన పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. శక్తి గణేష్ నగర్ కాలనీలో రూ.42.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, చిన్నాన్న తోట కమ్యూనిటీ హాల్, రోడ్ నంబర్ 3లో రూ.30 లక్షలతో చేపట్టనున్న రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.72.50 లక్షల నిధులతో ఈ పనులు చేపడుతున్నారు.

స్థానికంగా రహదారుల పరిస్థితి మెరుగుపడటంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తగ్గుతాయని, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే రహదారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు డీఈ మహేష్, ఏ. రవళి, వర్క్ ఇన్‌స్పెక్టర్ అఫ్రోజ్, మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జేఏసీ సురేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి, సురేష్, శోభన్ బాబు, భాస్కర్ రెడ్డి, మహేష్, రాజేందర్, అరుణ్, బషీర్, సాజిద్, కన్నా, వీరయ్య, ప్రశాంత్, హరిత, విజయ్ రెడ్డి, మాసెట్టి అనిల్, కిరణ్ ముదిరాజ్, అజిత్ రావు, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju 

Alwal