Bharat Aawaz

విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం.

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
128
Views

విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం

 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సుజాతనగర్ మండలంలోని గరీబ్‌పేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, రామవరం నేతాజీ బస్తీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ న్యాయవాది సాహితి, జిల్లా పారా లీగల్ వాలంటీర్ బండి విజయభాస్కర్ పాల్గొని విద్యార్థులకు చట్టాలు, బాలల హక్కులు, పిల్లల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే ఇంట్లో తల్లిదండ్రులకు, పాఠశాలలో ఉపాధ్యాయులకు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు.

 

అలాగే బాలల సమస్యలపై చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉచిత న్యాయ సహాయం కోసం లీగల్ హెల్ప్‌లైన్ 15100 నంబర్లకు సమాచారం అందించాలని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సఫియా, విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.