Bharat Aawaz

ఓటు బచావో – దేశ్ బచావో నినాదంతో ఢిల్లీకి బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు.

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
109
Views

ఓటు బచావో – దేశ్ బచావో నినాదంతో ఢిల్లీకి బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు

 

భద్రాద్రి కొత్తగూడెం : నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పిలుపునిచ్చారు.

 

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అధ్యక్షతన జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలను ప్రత్యేక బస్సుల ద్వారా ఢిల్లీకి పంపించారు.

 

ఈ సందర్భంగా తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. SIR పేరుతో ఓటర్ల తొలగింపును అరికట్టే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ఢిల్లీకి బయలుదేరిన బస్సును ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తిక్, అధికార ప్రతినిధి యరమల శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీలు ఎం. పెద్దబాబు, లోశెట్టి నాగార్జున, పైడా రాజేంద్రప్రసాద్, డీసీసీ ట్రెజరర్ కోడుమూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు మంద హనుమంతు, జానీ పాషా, డీసీసీ కార్యదర్శి పాల్, తుమ్మ రాంబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతలపూడి రాజశేఖర్, 28వ డివిజన్ కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మీ హరి, చుంచుపల్లి సర్పంచ్ వీరన్న, కాంగ్రెస్ నాయకులు చిమ్మట నాగేశ్వరరావు, పూణెం శీను, కున్సోత్ కిషన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.