Bharat Aawaz

బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బూడిపూడి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన లకావత్ గిరిబాబు

Mahidhar Naidu
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
49
Views

బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బూడిపూడి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన లకావత్ గిరిబాబు

 

జూలూరుపాడు: మండలంలోని న్యూ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త బూడిపూడి ప్రభాకర్ వారి సతీమణి మాణిక్యమ్మ  గుండెపోటుతో మృతి చెందడంతో, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు వారి నివాసానికి వెళ్లి మాణిక్యమ్మ వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు యదలపల్లి వీరభద్రం, మార్కాపురి నరసింహారావు, పోతురాజు రామారావు, సిద్దెబోయిన రామ్మూర్తి, బానోత్ హనుమంత్ రావు, బూడిపూడి ప్రతాప్, ఇల్లంగి తిరుపతి, కాశీమళ్ళ కమలాకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.