News Telangana పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. Thalakokkula Sadanandam Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member 12/10/2026 · 3 min read 0 Comments 372 Views ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి,పెద్దపల్జి జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గోదావరిఖనిలో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ పరీక్షల సన్నద్ధతను అంచనా వేసుకుని, పోటీ పరీక్షల్లోమెరుగైనప్రతిభ,కనబరిచేందుకు అక్టోబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచిమధ్యాహ్నం1గంటవరకుపరీక్షనిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రోత్సాహకంగా మొదటి బహుమతిగా రూ.10,000,రెండోబహుమతిగారూ.5,000,మూడోబహుమతిగారూ.2,000నగదుబహుమతులుఅందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 100 మంది అభ్యర్థులకు ఉచితఫిజికల్ట్రైనింగ్తోపాటుభోజనం,వసతిసౌకర్యాలుకల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు https://forms.gle/EwsqCLeErjgEPTih6 లింక్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7780543055, 8886304040 నంబర్లలో సంప్రదించగలరు.